హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కౌంటర్ టెర్రరిస్ట్ కంటింజెన్సీ మాక్ డ్రిల్
- October 23, 2020
హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) యొక్క విమానాశ్రయ భద్రతా బృందం (ASG) అక్టోబర్ 21న "కౌంటర్ టెర్రరిస్ట్ కంటింజెన్సీ"పై పూర్తి స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించింది. విమానాశ్రయం పశ్చిమ డిపార్చర్ రాంప్ వద్ద ఈ డ్రిల్ నిర్వహించారు. ఇందులో ఆక్టోపస్ (తెలంగాణ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్), స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు.
సిఐఎస్ఎఫ్, ఆక్టోపస్, లోకల్ పోలీస్, రక్షా (హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయ భద్రతా సిబ్బంది), ఎయిర్‌పోర్ట్ రెస్క్యూ అండ్ ఫైర్ ఫైటింగ్ (ARFF), టెర్మినల్ ఆపరేషన్స్, అపోలో మెడికల్ సెంటర్ నుండి సుమారు 400 మంది సిబ్బంది ఈ కౌంటర్ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. ఈ డ్రిల్ సమయంలో టెర్రరిస్ట్ పరిస్థితిని సృష్టించి, విజయవంతంగా వారిని నిర్వీర్యం చేయడం జరిగింది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో హైపర్ సెన్సిటివ్ ఎయిర్‌పోర్ట్ విభాగం కిందికి వస్తుంది. స్థానిక అధికారులతో కలిసి విమానాశ్రయంలోని అందరు ముఖ్య భాగస్వాములు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారని నిర్ధారించుకోవడానికి ఇటువంటి డ్రిల్స్ నిర్వహిస్తారు. తద్వారా అధికారులు మరియు ప్రయాణికులలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది.
పూర్తి స్థాయి కౌంటర్ టెర్రరిస్ట్ కంటింజెన్సీకి ముందు, అక్టోబర్ 19న ఆక్టోపస్, లోకల్ పోలీసులు మొదలైన భాగస్వాములందరితో టేబుల్ టాప్ వ్యాయామం నిర్వహించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!