వాట్సాప్ యూజర్లకు శుభవార్త
- October 23, 2020
ఫేస్ బుక్ సారధ్యంలోని మెసేజింగ్ యాప్ వాట్సాప్ కీలక ఫీచర్‌ను తీసుకొచ్చింది. గ్రూపు చాట్స్, అలర్ట్స్ తో విసిగిపోయిన యూజర్లుకు కొత్త అప్ డేట్ అందించింది. వాట్సాప్‌లోని గ్రూప్ చాట్‌లను ఆల్వేస్ మ్యూట్ అనే ఆప్షన్ తోఎప్పటికీ మ్యూట్ చేసే ఫీచర్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని వాట్సాప్ తన అధికారిక ట్విటర్ లో వెల్లడించింది. చాట్‌ను ఎప్పటికీ మ్యూట్ చేయవచ్చని ట్వీట్ చేసింది.
వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నఈ ఫీచర్‌ను చివరకు లాంచ్ చేసింది. ఐఫోన్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులో ఉంది. ఈ క్రొత్త ఫీచర్ ప్రజలు ఆ ఇబ్బందికరమైన వాట్సాప్ గ్రూపులనుంచి ఎప్పటికీ ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇదిసహాయపడుతుంది. చాట్‌ను మ్యూట్ చేస్తే సంబంధిత గ్రూపులనుంచి నోటిఫికేషన్ రాదు. సందేశాలు, చిత్రాలు లేదా వీడియోలు, ఇతర ఏ ఫీడ్ ఇబ్బంది పెట్టదు. అంతేకాదు. అవసరమైతే దీన్ని అన్‌మ్యూటింగ్ అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు ఈ సదుపాయం ఎనిమిది గంటలు, ఒక వారం, ఒక సంవత్సరం పాటు మ్యూట్ చేయడానికి అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన