దోహాలో 'బతుకమ్మ' వేడుకలు
- October 24, 2020
దోహా:తెలంగాణ జాగ్రుతి ఖతర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి.
ముఖ్య అతిథిలుగా ఖతర్ లో భారత్ రాయబారి దీపక్ మిత్తల్ ,AP మణికంఠన్ , బాబు రాజన్ , వినోద నాయర్ హాజరయ్యారు.
తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని తెలిపిన వివరాల ప్రకారం ఖతర్ కోవిడ్ నిబంధనలు ప్రకారం భౌతిక దూరం పాటిస్తూ , చేనేత మాస్క్‌లు ధరించి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించామని, మనషుల మధ్య దూరం పెంచిన మాయదారి కరోనా ఆ గౌరమ్మ దయవల్ల అంతమవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అనంతరం గత చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత చాలెంజ్ విజేతలకు తెలంగాణ నుండి ఖతర్ కు ప్రత్యేకంగా తెప్పించిన చేనేత చీరలు బహుకరించారు.
ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు హరికా ప్రేమ్, సుధ శ్రీ రామోజీ,స్వప్న కేసా, సాయిగిరి వంశీ, స్వప్న అల్లే, మమతా దుర్గం, అరుణ్ అలిశెట్టి, శ్రీ కాంత్ కొమ్ముల పాల్గొన్నారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతర్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన