ప్రపంచంలోనే వేగవంతమైన నెట్ వర్క్ గా ఎతిసలాత్ కు ఓక్లా గుర్తింపు

- October 24, 2020 , by Maagulf
ప్రపంచంలోనే వేగవంతమైన నెట్ వర్క్ గా ఎతిసలాత్ కు ఓక్లా గుర్తింపు

యూఏఈ:యూఏఈ టెలికం ఆపరేటర్ ఎతిసలాత్ ప్రపంచంలోనే అత్యధిక వేగవంతమైన నెట్ వర్క్ కలిగిన టెలికం సంస్థగా గుర్తింపు పొందింది. రెండో త్రైమాసిక మాసం నుంచి మూడో త్రైమాసిక మాసానికి సంబంధించి 98.78 స్కోర్ తో ఎతిసలాత్ ఈ ఘనత సాధించినట్లు ప్రముఖ టెలికం రేటింగ్ సంస్థ ఓక్లా ప్రకటించింది. ఓక్లా సంస్థ ప్రపంచవ్యాప్తంగా అని టెలికం ఆపరేటింగ్ సంస్థల పని తీరును, మొబైల్ నెట్వర్క్ వేగాన్ని పరిశీలించి విశ్లేషించే ఓ సంస్థ. అధునాతన సాంకేతికతను వినియోగించటం, వినియోగదారుల మధ్య ఎంత వేగంగా అనుసంధానం చేస్తున్నాయనే అంశాలను ప్రమాణికంగా తీసుకొని స్పీడ్ టెస్ట్ నివేదికను రూపొందిస్తుంది. ఈ నివేదిక ఆధారంగా ఓక్లా ప్రకటించిన తొలి పది ర్యాంకుల్లో యూఏఈలోని ఎతిసలాత్ 98.78 స్పీడ్ స్కోరుతో తొలి ర్యాంక్ సాధించింది. ఆ తర్వాత స్థానంలో వరుసగా ఎస్‌కె టెలికాం (దక్షిణ కొరియా), ఒరేడూ (ఖతార్), వివాకామ్ (బల్గేరియా), టి-మొబైల్ (నెదర్లాండ్స్), టెలస్ (కెనడా), టెలినార్ (నార్వే), వొడాఫోన్ (అల్బేనియా), చైనా మొబైల్ (చైనా), హర్వాట్స్కి టెలికాం (క్రొయేషియా) మరియు టెలియా (లిథువేనియా) ఉన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com