బెంగుళూరు పై చెన్నై విజయం

బెంగుళూరు పై చెన్నై విజయం

దుబాయ్:ఐపీఎల్ 2020 లో ఈ రోజు మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టులో కెప్టెన్ కోహ్లీ హాఫ్ సెంచరీ తో సాధించడంతో ఆ జట్టు నిర్ణిత ఓవర్లలో  6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఇక 146 పరుగుల టార్గెట్ తో వచ్చిన చెన్నై జట్టు ఓపెనర్ ఫాఫ్ డుప్లెసిస్ (25) పరుగులకే వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు 39 పరుగులకు పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ అప్పటికే గ్రౌండ్ లో నిలదొక్కుకున్న ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (65) అలాగే కెప్టెన్ ధోని(19) పరుగులు చేసి మరో వికెట్ పడకుండా జట్టును 18.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేర్చారు. ఇది చెన్నైకి ఈ సీజన్ లో నాలుగో విజయం అయితే బెంగళూరు నాలుగో పరాజయం. ఇక ఈ గెలుపుతో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానం నుండి 7వ స్థానానికి వస్తే బెంగళూరు అదే మూడో స్థానం లో ఉంది.   

Back to Top