భారత్-దుబాయ్ ప్రయాణికులకు గమనిక..మరో 3 కోవిడ్ ల్యాబ్ లపై సర్టిఫికేషన్ పై నిషేధం

- October 27, 2020 , by Maagulf
భారత్-దుబాయ్ ప్రయాణికులకు గమనిక..మరో 3 కోవిడ్ ల్యాబ్ లపై సర్టిఫికేషన్ పై నిషేధం

భారత్ లోని మరో 3 కోవిడ్ ల్యాబులు జారీ చేసే ఆర్టీ పీసీఆర్ టెస్టులను బ్లాక్ లిస్టులో పెట్టింది దుబాయ్. ఇక నుంచి ఆ మూడు ల్యాబ్ లు జారీ చేసే కోవిడ్ సర్టిఫికేషన్ ను తాము పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. ఈ మేరకు దుబాయ్ కి విమాన సర్వీసులు నడుపుతున్న ఎయిర్ లైన్స్ సంస్థలకు కూడా సమాచారం ఇచ్చింది. భారత్ నుంచి దుబాయ్ వచ్చే ప్రయాణికులు అందరూ ముందస్తుగానే కోవిడ్ ఆర్టీ పీసీఆర్ టెస్టులు చేయించుకోవటం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే..కొన్ని ల్యాబుల నుంచి జారీ అవుతున్న టెస్ట్ రిజల్ట్స్ లో ఖచితత్వం లేదని, అనుమానస్పదంగా ఉన్న ఆయా ల్యాబులను దుబాయ్ బ్లాక్ లిస్టులో చేరుస్తూ వస్తోంది. గత సెప్టెంబర్ లో నాలుగు కోవిడ్ ల్యాబ్ లను ఇదే తరహాలో బ్లాక్ చేసింది. జైపూర్ లోని సూర్యం ల్యాబ్, కేరళాలోని మైక్రో హెల్త్ ల్యాబొరేటరీ, ఢిల్లీలోని డాక్టర్ బాసిన్ పథ్ ల్యాబ్స్, నోబుల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ల నుంచి జారీ అయ్యే కోవిడ్ టెస్ట్ రిజల్ట్స్ ను పరిగణలోకి తీసుకోబోమని గత సెప్టెంబర్ 27న ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కోజికోడ్, ఢిల్లీ, చైన్నైలోని అజా డయాగ్నోస్టిక్ సెంటర్, 360 డయాగ్నోస్టిక్ అండ్ హెల్త్ సర్వీసెస్, ఆరా క్లినికల్ ల్యాబరేటరీస్ లను బ్లాక్ లిస్టులో చేర్చింది దుబాయ్. ఇక నుంచి ఈ 7 ల్యాబుల నుంచి కోవిడ్ టెస్ట్ సర్టిఫికెట్లను తీసుకొచ్చే ప్రయాణికులను దుబాయ్ ప్రయాణానికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు.

అయితే..గతంలో 4 ల్యాబ్ లను బ్లాక్ లిస్టులో చేర్చినప్పుడు..వందలాది ప్రయాణికులు ఇండియాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో వారికి వెసులుబాటు కల్పించిన దుబాయ్..బ్లాక్ లిస్టులో ఉన్న ఆ 4 ల్యాబుల నుంచి కాకుండా ఇతర ల్యాబుల్లో టెస్టులు చేయించుకొని దుబాయ్ కి ప్రయాణం చేసేలా ప్రయాణ తేదీలను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించారు. అయితే..ప్రస్తుతం మరో 3 ల్యాబులపై కూడా నిషేధం విధించటంతో...ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఏదైనా వెసులుబాటు కల్పిస్తారా అనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com