ప్రొఫెట్‌ మొహమ్మద్‌ క్యారికేచర్స్‌పై సౌదీ అరేబియా సీరియస్‌

- October 27, 2020 , by Maagulf
ప్రొఫెట్‌ మొహమ్మద్‌ క్యారికేచర్స్‌పై సౌదీ అరేబియా సీరియస్‌

రియాద్:ప్రొఫెట్‌ మొహమ్మద్‌ని కించపర్చేలా క్యారికేచర్స్‌ ఎవరైనా వేస్తే, అలాంటి ఆర్టిస్టులపై చట్టపరంగా కరిÄన చర్యలు తప్పవని సౌదీ అరేబియా హెచ్చరించింది. దీన్ని టెర్రరిస్ట్‌ యాక్ట్‌గా పరిగణిస్తామని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. కుట్రదారులు ఎవరైనాసరే, చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. ఓ హిస్టరీ టీచర్‌, ప్రొపెట్‌ కార్టూన్స్‌ని విద్యార్థులకు క్లాస్‌ రూంలో చూపించిన ఘటనకు సంబంధించి సదరు టీచర్‌ తల నరికివేయడం జరిగింది. ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ ఇమ్మాన్యుయేల్‌ మాక్రోన్‌ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కాగా, ముస్లిం మెజార్టీ దేశాలు ప్రొఫెట్‌ మొహమ్మద్‌కి సంబంధించిన కార్టూన్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. మాక్రోన్‌కి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తుతున్నాయి. ఫ్రెంచ్‌ ఫ్లాగ్స్‌ని తగలబెడుతున్నారు. లిబియా క్యాపిటల్‌ ట్రిపోలిలోనూ మాక్రోన్‌కి వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com