మస్కట్:నిబంధనలు ఉల్లంఘించిన కార్మికుల భర్తీ కార్యాలయం మూసివేత
- October 28, 2020
మస్కట్:గృహ కార్మికులను భర్తీ చేసే కార్యాలయం...తమ వినియోగదారులను మోసం చేస్తుండటంతో ఆ కార్యాలయాన్ని శాశ్వతంగా మూసివేయాల్సిందిగా సీబ్ కోర్టు ఆదేశించింది. వినియోగదారుల భద్రత చట్టం మేరకు ఈ తీర్పు ఇచ్చినట్లు కోర్టు వెల్లడించింది. అంతేకాదు..దోషిగా తేలిన సదరు రిక్రూట్మెంట్ కంపెనీకి RO2000 జరిమానా విధించింది. డొమస్టిక్ వర్కర్లను రిక్రూట్ చేసుకునే సమయంలో నిబంధనల ఉల్లంఘన...అలాగే తమతో కుదర్చుకున్న కాంట్రాక్ట్ విషయంలోనూ హామీలను నెరవేర్చటంలో సదరు కంపెనీ విఫలం అయ్యిందనేది వినియోగదారుల ఆరోపణ. అంతేకాదు..కాంట్రాక్ట్ హామీలపై కంపెనీ నిర్వహకులను సంప్రదించేందుకు ప్రయత్నించినా సరైన తీరులో స్పందించకపోవటంతో విషయం కోర్టు వరకు చేరింది. విచారణ చేపట్టిన న్యాయస్థానం సదరు రిక్రూట్మెంట్ కంపెనీ నియోగదారుల భద్రత చట్టానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు నిర్ధారించి..కంపెనీపై శాశ్వత నిషేధం, RO2000 జరిమానా విధించింది.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం