వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్పై ఇండియా గైడ్ లైన్స్
- October 28, 2020
కువైట్ సిటీ:కరోనా నేపథ్యంలో వీసా మరియు ట్రావెల్ రిస్ట్రిక్షన్స్కి సంబంధించి భారత ప్రభుత్వం గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది.వందే భారత్ మిషన్ లేదా ఎయిర్ బబుల్ విధానం ద్వారా నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలకు సంబంధించి ఈ గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఆరిజన్ పర్సన్స్ కార్డ్ హోల్డర్స్, ఏ దేశం పాస్‌పోర్ట్‌ని కలిగి వున్నా వారు అర్హులే అవుతారు. టూరిస్ట్ వీసాపై కాకుండా ఇతత్రా అవసరాల నిమిత్తం భారతదేశంలో పర్యటించాలనుకునే ఫారిన్ నేషనల్స్ కూడా అర్హులే. ఎలక్ట్రానిక్ వీసా (ఇ-వీసా), టూరిస్ట్ వీసా మరియు మెడికల్ వీసా తప్ప అన్ని ఎగ్జిస్టింగ్ వీసాస్ చెల్లుబాటవుతాయి. నేపాల్, భూటాన్ పౌరులు ఏ దేశం నుంచి అయినా ఇండియాకి రావొచ్చు. క్వారంటైన్ సహా ఇతర హెల్త్ / కోవిడ్ 19 నిబంధనల్ని ప్రయాణీకులు తప్పక పాటించాల్సి వుంటుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం
- వక్ఫ్ బోర్డు చట్టంలోని కొన్ని నిబంధనల పై సుప్రీం కోర్టు స్టే
- దుబాయ్ లో బ్యాంక్ ఫ్రాడ్.. అంతర్జాతీయ ముఠా అరెస్టు..!!
- సెహహతి యాప్‌లో సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్ బుకింగ్..!!
- కొత్త వాహనాల ఎగుమతిని నిషేధించిన ఖతార్..!!
- ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని ఆవిష్కరించిన బహ్రెయిన్..!!
- ఒమన్ లో అడ్వాన్స్డ్ ఎయిర్ మొబిలిటీ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!