బహ్రెయిన్:హిట్ అండ్ రన్ కేసులో వాహనదారుడికి రిమాండ్

- October 28, 2020 , by Maagulf
బహ్రెయిన్:హిట్ అండ్ రన్ కేసులో వాహనదారుడికి రిమాండ్

మనామా:దురుసుగా డ్రైవింగ్ చేసి నలుగురు మృతికి కారణమైన వాహదారుడిని మరింత విచారించేందుకు అనువుగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 19న
బురి వెళ్లే దారిలో హమాలా సమీపంలో వలి అల్ అహద్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 21 ఏళ్ల వ్యక్తి..అజాగ్రత్తగా, అతివేగంగా కారు నడపటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన నలుగురు ఆసియా దేశాలకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. మరో ముగ్గురు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. హైవే అతివేగంగా కారును నడిపిన యువకుడు...నిబంధనలకు విరుద్ధంగా ఎదుటి వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించాడని, ఆ సమయంలో కారు అదుపు తప్పటంతో డివైడర్ ను ఢీ కొని అవతలి వైపు ఉన్న రోడ్డులో మరో వాహనాన్ని ఢికొట్టిందని వివరించారు. ప్రమాదంపై వెంటనే దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com