ఆరుగుర్ని కాల్చి చంపిన సౌదీ టీచర్
- February 14, 2016
సౌదీ టీచర్ అబ్దుల్లా అల్ మలికి, ఆరుగురు సహచరుల్ని గత గురువారం మెషీన్ గన్‌తో చంపిన ఘటన అరబ్ పౌరుల్ని షాక్‌కి గురిచేసింది. వ్యక్తిగత విభేదాలే ఈ దారుణానికి కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకి వచ్చారు. సూపర్‌వైజర్‌తో నిందితుడికి గొడవలున్నాయనీ, అవే ఈ స్థాయిలో ఘాతుకానికి పాల్పడేలా చేశాయని అంటున్నారు. 'నా చుట్టూ వున్నవారెవరూ నిజాయితీపరులు కాదు. వారికి నీతి లేదు. నాకు నిజం తెలియాలి' అంటూ తనతో నిందితుడు ఘటన జరగడానికి ముందు చెప్పినట్లు స్కూల్ హెడ్‌మాస్టర్ అహ్మద్ జబ్బర్ వివరించారు. అతనిలో ఈ విపరీత ప్రవర్తనను అప్పుడు అంచనా వేయలేకపోయానని ఆయన అన్నారు. వ్యక్తిగతంగా నిందితుడికి ఎవరితోనూ గొడవలు లేవనీ, ఏదో మానసిక సమస్యతో ఈ పని చేసి ఉంటాడని కూడా అనుమానిస్తున్నారు కొందరు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







