సముద్రంలో తప్పిపోయిన ఫిషర్మెన్ దొరికారు
- February 14, 2016
ముగ్గురు భారతీయ వలస ఫిషర్మెన్ సముద్రంలో తమ బోటుతో సహా గల్లంతయిన ఘటన ఆందోళన కలిగించింది. అయితే ఆ ముగ్గురినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. గత మంగళవారం తప్పిపోయిన వీరిని నిన్న రక్షించారు. బోట్ కెప్టెన్ జస్టిన్, ఫిషర్మెన్ ముత్క్కులి పిచాయ్, తమిళ మారన్ సముద్రంలో తప్పిపోగా, కోస్ట్గార్డ్ సహకారంతో మూడు ఫిషింగ్ బోట్స్ వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి, వారిని కనుగొన్నారు. సుమారు 500 మంది ఫిషర్మెన్ సిట్రాలో పనిచేస్తుంటారు. ఇందులో చాలామంది భారతదేశంలోని తమిళనాడుకు చెందినవారు. బోట్ ఇంజిన్ పాడయినట్లుగా తమకు సమాచారం లభించడంతో అధికారులకు సమాచారమిచ్చినట్లు తమిళ మారన్ తండ్రి చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫిషర్మెన్ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







