ఉత్తరాంధ్ర లో మొదటిసారి పర్యటించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

- October 29, 2020 , by Maagulf
ఉత్తరాంధ్ర లో  మొదటిసారి పర్యటించిన హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత

ఏ.పి: ఏ.పి రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత మొదటిసారి ఉత్తరాంధ్ర లో పర్యటించారు. శ్రీకాకుళం జిల్లా లో పర్యటించిన హోంమంత్రి కి స్థానిక నేతలు ఘనస్వాగతం పలికారు. ముబాగం చేరుకున్న హోంమంత్రి సుచరిత గారిని డెప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కుటుంబసమేతంగా స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి కృష్ణదాస్ నివాసంలో జిల్లా నేతలతో హోంమంత్రి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డా.సీదిరి అప్పల రాజు, శాసన సభ్యులు కంబాల జోగులు, విశ్వాసరాయి కళావతి, గొర్లె కిరణ్ కుమార్, డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, డిసిఎంఎస్ చైర్మన్ పిరియా సాయిరాజ్, తూర్పు కాపు, కళింగ కోమటి, కాళింగ ఛైర్మన్లుగా నియమితులైన మామిడి శ్రీకాంత్, అంధవరపు సూరిబాబు, పేరాడ తిలక్., కేంద్ర మాజీ మంత్రి డా.కృపారాణి, దువ్వాడ శ్రీనివాస్, ఏఎస్పీ సోమశేఖర్, డిఎస్పీ ఎం.శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com