ఏపీలో నవంబర్‌ 2 నుంచి దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

- October 29, 2020 , by Maagulf
ఏపీలో నవంబర్‌ 2 నుంచి దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం

విజయవాడ:ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను నవంబర్‌ 2 నుంచి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రారంభించించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విడతల వారీగా తరగతులు ప్రారంభమవుతాయి. కేంద్రం అన్‌లాక్‌ 5 నిబంధనల సవరింపుతో గతంలో విధించిన ఆంక్షలను నవంబర్ 30 వరకూ పొడిగించిన నేపథ్యంలో తాము మాత్రం విద్యాసంస్ధలు నవంబర్ 2 నుంచి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పష్టం చేసింది.

ఏపీలో విద్యాసంస్ధల పునఃప్రారంభంపై గతంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం నవంబర్‌ 2 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రోజు విడిచి రోజు విధానంలో తరగతులు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం వరకూ మాత్రమే విద్యాసంస్ధలు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్‌ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com