ఏపీలో నవంబర్ 2 నుంచి దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం
- October 29, 2020
విజయవాడ:ఏపీలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలను నవంబర్ 2 నుంచి ఎట్టిపరిస్ధితుల్లోనూ ప్రారంభించించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విడతల వారీగా తరగతులు ప్రారంభమవుతాయి. కేంద్రం అన్‌లాక్ 5 నిబంధనల సవరింపుతో గతంలో విధించిన ఆంక్షలను నవంబర్ 30 వరకూ పొడిగించిన నేపథ్యంలో తాము మాత్రం విద్యాసంస్ధలు నవంబర్ 2 నుంచి పునఃప్రారంభిస్తామని ప్రభుత్వం ఇవాళ మరోసారి స్పష్టం చేసింది.
ఏపీలో విద్యాసంస్ధల పునఃప్రారంభంపై గతంలో ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం నవంబర్ 2 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రోజు విడిచి రోజు విధానంలో తరగతులు నిర్వహిస్తారు. అలాగే మధ్యాహ్నం వరకూ మాత్రమే విద్యాసంస్ధలు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చారు. కోవిడ్ వ్యాపించకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ మేరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని క్లాసుల పునఃప్రారంభానికి సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేశారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!