ఏ.పీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు
- October 29, 2020
అమరావతి: వచ్చేనెల నవంబరు 1న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ, ముఖ్య కార్యదర్శి(పొలిటికల్) ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని వారి క్యాంపు కార్యాలయంలో ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించ నున్నారు. ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి, మంత్రులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర ఇన్ చార్జీ మంత్రులు,మంత్రులు,జిల్లా కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్నారు. అలాగే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనుటకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఎపి భవన్ లో కూడా రాష్ట్ర అవతరణ వేడుకలు జరుగనున్నాయి.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం