మస్కట్:కంప్యూటర్ స్టోర్స్ పై నిరంతర పర్యవేక్షణ..
- October 31, 2020
మస్కట్:దేశంలో కంప్యూటర్ల కృత్రిమ కొరతకు తావు లేకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఒమన్ లోని వినియోగదారుల భద్రత అధికార విభాగం స్పష్టం చేసింది. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలను కంప్యూటర్లు, విడిభాగాలను అమ్మాలని కక్కుర్తికి పోతే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. దేశంలో కంప్యూటర్ల లభ్యత, అన్ని వర్గాల ప్రజలకు వాటి ధరలు అందుబాటులో ఉన్నాయా..లేదా నిర్ధారించుకునేందుకు అధికారులు ఎప్పటికప్పుడు కంప్యూటర్ స్టోర్స్ లలో తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మస్కట్ లోని పలు కంప్యూటర్ స్టోర్స్ లో కంప్యూటర్స్, విడిభాగాల స్టాక్ ను పరిశీలించి..వాటి ధరలు సహేతుకంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. కోవిడ్ 19 పరిణామాల తర్వాత ఆన్ లైన్ ద్వారా ఆఫీస్ పనులు నిర్వహించటం, ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండటం పెరిగింది. దీంతో కంప్యూటర్లకు, వాటి విడిభాగాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు కంప్యూటర్ స్టోర్స్ నిర్వాహకులు కంప్యూటర్లకు కృత్రిక కొరత సృష్టించి..వాటిని అధిక ధరలకు అమ్ముతూ ప్రజలను దోచుకుంటున్నారు. దీంతో కంప్యూటర్ ధరలను నియంత్రించేందుకు వినియోగదారుల భద్రత విభాగం ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!