వీడు మాములోడు కాదు..! బుర్జ్ ఖలీఫాపై లవ్ ప్రపోజల్ కి ప్లాన్...
- October 31, 2020
దుబాయ్:హార్ట్ అండ్ సోల్ గా ఓ అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి..ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచే క్షణం అత్యంత ఉద్విగ్న క్షణం. కలల దేవతను తాను ఎంత గొప్పగా ఆరాధిస్తున్నాడో ఆమెకు అర్ధం అయ్యేలా..ఆమెను ఇంప్రెస్ చేసేలా లవ్ ప్రపోజ్ చేసేందుకు తెగ తపన పడిపోతుంటారు. కాస్తా విభిన్నంగా ఆలోచిస్తూ వారెవ్వా అనిపించుకునే వాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు మన రోమియో మాత్రం గతంలో ఎవరూ చేయని రేంజ్ లో తన లవ్ ప్రపోజల్ చేయబోతున్నాడు. తన మనసులోని భావాలకు దుబాయ్ ఐకాన్ బుర్జ్ ఖలిఫాపై అక్షర రూపం ఇవ్వబోతున్నాడు. ' యూ గేవ్ మి ఏ న్యూ వరల్డ్, కాన్ ఐ హావ్ ఇట్ ఫరెవర్?' (నువ్ నాకు ఓ కొత్త ప్రపంచాన్ని ఇచ్చావ్...జీవితాంతం నేను పొందగలనా?) అంటూ తన ప్రేమను బుర్జ్ ఖలీఫాపై లేజర్ షోతో ప్రపోజ్ చేయబోతున్నాడు.
అంతర్జాతీయ ఈవెంట్లు, స్వాతంత్ర్య శుభాకాంక్షలు ఇలా గొప్ప గొప్ప ఘట్టాలకు సంబంధించిన లేజర్ షోలను మాత్రమే బుర్జ్ ఖలీఫాపై చూశాం. కానీ, ఓ ప్రేమికుడి
మనసులోని మాటలను చెప్పేందుకు బుర్జ్ ఖలీఫా వేదిక అవటం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చు. ఇంత గొప్పగా లవ్ ప్రపోజల్ కు ప్లాన్ చేసుకున్న వ్యక్తి మన ఇండయా కుర్రాడే. దుబాయ్ లో ట్రావెల్ ఏజెన్సీలో జాబ్ చేస్తున్నాడు. ఆమె మరో దేశంలో ఉంటుంది. కొంత ప్రాంతాల్లో పర్యటించటం అంటే ఆమెకు ఇష్టం. మనోడికి కూడా ప్రయాణాలంటే ఇష్టమే. దీంతో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఆమె వయసు 30. తన వయసు 29. అయితే..ఇంతకు మించి ఆమె వివరాలను, తన వివరాలను ఇప్పుడే అందరికీ తెలియటం తనకు ఇష్టం లేదంటున్నాడు అతను. కానీ, తన ప్రేమ కథను మాత్రం మాతో పంచుకున్నాడు.
"యూ గేవ్ మి ఏ న్యూ వరల్డ్, కాన్ ఐ హావ్ ఇట్ ఫరెవర్...'నిజంగానే ఆమె నాకు ప్రపంచాన్ని పరిచయం చేసింది. పశ్చిమ దేశాలకు చెందిన ఆమె ఐదేళ్ల క్రితం దుబాయ్ కి వచ్చింది. ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగం కావటంతో నాకు ఆమెతో పరిచయం ఏర్పడింది. తొలి పర్యటనలో ఆమె ఇక్కడ ఎక్కువ రోజులు లేదు. కానీ, 4 నెలల తర్వాత మళ్లీ ఆమె దుబాయ్ వచ్చింది. ఈ సారి నేను దుబాయ్ ని నా కళ్లతో చూపించాను. దుబాయ్ సంస్కృతిని, దుబాయ్ ప్రకృతి అందాలను కొత్తగా పరిచయం చేయటంతో ఆమె పరవశురాలైంది. స్కై డైవింగ్ చేశాం..ఇక్కడి బీచ్ లలో మేం అద్భుతమైన సూర్యస్తమయ సన్నివేశాలను ఆస్వాదించాం. దీంతో ఆమె
దుబాయ్ పై ప్రేమను పెంచుకుంది. తరచుగా వస్తుండేది. అలా మా ఇద్దరి స్నేహం బలపడింది. ఆ తర్వాత మేం ఇద్దరం కలిసి 20 దేశాల్లో పర్యటించాం. హిమాలయ్యాల్లో ట్రెక్కిం చేశాం..పల్లెల్లో పర్యటించాం..స్థానిక సంస్కృతిని, అహార అలవాట్లను ఆస్వాదించాం. ఈ ఐదేళ్లలో ఎన్నో మధురానుభూతులను నింపుకున్నాం' అంటూ తన ప్రేమ ప్రయాణాన్ని వివరించాడు. 'వ్యక్తిగతంగా ఆమె నిజంగా నిస్వార్ధపరురాలు, ఇతరుల క్షేమం కోసం ఆలోచిస్తుంది. మా కుటుంబంతో నా కంటే ఎక్కువగా ఆమెకు అనుబంధం ఏర్పడింది. అపారమైన ప్రేమను పంచింది. ఇక ఆమే నా జీవితం'.
ఇంత గొప్పగా ఆరాధిస్తున్న తన ప్రేయసికి తన ప్రేమను వ్యక్త పరిచేందుకు కొన్ని నెలలుగా తీరిక లేకుండా అద్భుత క్షణాలను డిజైన్ చేసుకున్నాని చెబుతున్నాడతను. ఆమె కోసం పర్ ఫెక్ట్ డైమండ్ ను సెలక్ట్ చేసేందుకు తనకు రెండు నెలలు పట్టిందట. ఇక బుర్జ్ ఖలీఫాపై నవంబర్ 4న రాత్రి 8 గంటల సమయంలో తన మనసులో మాటలను లేజర్ షో ద్వారా వ్యక్తం చేయబోతున్నాడు. కానీ, ఆ లక్కీ గర్ల్ ఎవరో మాత్రం ఎవరికీ తెలియదు. మరి..ఈ అమర ప్రేమికుడి ప్రపోజల్ కు ఆమె ఫిదా అవుతుందా? వెయిట్ ఫర్ నవంబర్ ఫోర్త్.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు