జాబ్‌ సెక్యూరిటీ సిస్టం బెనిఫిట్‌ ఇ-రిక్వెస్ట్‌ ఇలా

- October 31, 2020 , by Maagulf
జాబ్‌ సెక్యూరిటీ సిస్టం బెనిఫిట్‌ ఇ-రిక్వెస్ట్‌ ఇలా

మస్కట్‌: పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సోషల్‌ ఇన్స్యూరెన్స్‌ (పిఎఎస్‌ఐ), జాబ్‌ సెక్యూరిటీ సిస్టం బెనిఫిట్‌కి సంబంధించి ఎలక్ట్రానిక్‌ రిక్వెస్ట్‌ సబ్‌మిట్‌ చేయడం గురించి ఓ ప్రకటన చేసింది. సబ్‌మిషన్‌కి సంబంధించి ఇలా ప్రక్రియను పూర్తి చేయాల్సి వుంటుందంటూ కొన్ని వివరాలు పేర్కొంది. ఎలక్ట్రానిక్‌ అథెంటికేషన్‌ ద్వారా ఐడీ కార్డు మొబైల్‌ ఫోన్‌ నెంబర్‌ ఉపయోగించాలి. మినిస్ట్రీ ఆఫ్‌ లేబర్‌ వెబ్‌సైట్‌ (http://www.mol.gov.om) లేదా పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సోషల్‌ ఇన్స్యూరెన్స్‌ వెబ్‌సైట్‌ (http://www.pasi.gov.om) లేదా జనరల్ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఒమన్‌ వర్కర్స్‌ వెబ్‌సైట్‌ (http://www.gfow.om)ని సందర్శించాలి. జాబ్‌ సెక్యూరిటీ ఐకాన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. సైన్‌ ఇన్‌ అవ్వాలి. జాబ్‌ సెక్యూరిటీ ఐకాన్‌ని సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని రీజన్స్‌తో మీరు అర్హులా.? కాదా.? అన్నది అక్కడ ప్రత్యక్షమవుతుంది. అర్హులైతే, బెనిఫిట్‌ డిస్బర్స్‌ మెంట్‌ రిక్వెస్ట్‌ని పూర్తి చేయాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com