పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'బ్లాక్డ్'
- October 31, 2020
హైదరాబాద్:మనోజ్ నందం, శ్వేత సాలూరు హీరోహీరోయిన్లుగా థ్యాంక్యూ ఇన్ఫ్రా టాకీస్ పతాకంపై రామ్ లొడగల దర్శకత్వంలో రామారావు లెంక, పద్మ లెంక కలసి నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ `బ్లాక్డ్`. ప్రదీప్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుని విడుదలకి సిద్దంగా ఉంది. ఇటీవల విడుదలైన `బ్లాక్డ్`మూవీ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది.
ఈ సందర్భంగా నిర్మాతలు పద్మ లెంక, రామారావు లెంక మాట్లాడుతూ...
``బ్లాక్డ్ మూవీలో థ్రిల్లింగ్ అంశాలు ఉంటూనే హారర్ కామెడీ జోనర్లో అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. విడుదలకి సిద్ధంగా ఉంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. ఆర్టిస్టులు కొత్తవారైనా బాగా చేశారు. సినిమా అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సినిమాలోని అన్ని పాటలు తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తాయి. త్వరలోనే టీజర్, పాటలని విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.
నటీనటులు:
మనోజ్ నందం, శ్వేత సాలూరు, శేకింగ్ శేషు, FM బాబాయ్, TNR, సత్య శ్రీ, మెహబూబ్ భాష, వినయ్ మహదేవ్, రామారావు లెంక, శ్రీనివాసరాజు, గుండు మురళి, అర్జున్, దియారాజ్ , సఖీ ప్రియ, జబర్దస్త్ దొరబాబు , జయవాణీ తదితరులు
సాంకేతిక నిపుణులు:
సినిమాటోగ్రఫి: వెంకటేష్. కె,
సంగీతం: ప్రదీప్ చంద్ర,
ఎడిటర్: సోమేష్ .M,
ఆర్ట్: ఈశ్వర్,
విఎఫ్ఎక్స్: జీవన్ జీఆర్,
సింగర్స్: సాయి చరణ్, స్పూర్తి జితేందర్,
పిఆర్ఓ : సాయి సతీష్,
కో-డైరెక్టర్: సాయి జ్జానేశ్వర్,
నిర్మాతలు : పద్మ లెంక, రామారావు లెంక,
దర్శకత్వం: రామ్ లొడగల.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!