హైదరాబాద్ నుంచి ముంబై మధ్య బుల్లెట్ ట్రైన్...
- November 01, 2020
హైదరాబాద్:హైదరాబాద్ నుంచి ముంబై మధ్య త్వరలో బుల్లెట్ ట్రైయిన్ చక్కర్లు కొట్టనుంది. ఇక ముంబై ప్రయాణం మరింత సులభతరం కానుంది. హైదరాబాద్ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక తయారీకి నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ బిడ్లను కూడా ఆహ్వానించింది. నవంబర్ 5న ప్రీ బిడ్ సమావేశం జరుగనుంది. నవంబర్ 11-17 తేదీల్లో టెండర్ పత్రాలను స్వీకరించనున్నారు. ఇక నవంబర్ 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేయనున్నారు. అన్నీ సానుకాలమైతే వచ్చే యేడాది చివరికి పనులు ప్రారంభం కావచ్చు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన