లక్ష్ హీరోగా "గ్యాంగ్ స్టర్ గంగరాజు" టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల!!

- November 01, 2020 , by Maagulf
లక్ష్ హీరోగా  \

హైదరాబాద్:రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా.. ప్రతిభగల యువదర్శకులను  ప్రోత్సహిస్తూ.. ప్రేక్షకులకు డిఫరెంట్  కథాచిత్రాలను అందిస్తున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో లక్ష్, రీసెంట్ గా "వలయం" వంటి థ్రిల్లర్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకున్నారు. తాజాగా  ఆయన ఎవరూ ఊహించని కథతో ప్రేక్షకులు థ్రిల్ ఫీల్ అయ్యే విధంగా " గ్యాంగ్ స్టర్ గంగరాజు" వంటి క్యాచీ టైటిల్ తో.. అద్భుతమైన కథాంశంతో  ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.. ప్రముఖ హిట్ చిత్రాల నిర్మాణ  సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.. ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ నవంబర్ 1న సాయంత్రం 5 గంటలకు విడుదల చేసారు.. న్యూ డైమెన్షన్ క్యారెక్టర్ లో లక్ష్ హీరోగా చేస్తున్న  ఈ చిత్రానికి హిట్ చిత్రాల సంగీత దర్శకుడు సాయి కార్తీక్ అద్భుతమైన ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. ప్రముఖ నటీ నటులు యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది..!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com