పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ ఉన్నవారికే ఒమన్ లోకి అనుమతి-సుప్రీం కమిటీ
- November 02, 2020
మస్కట్:ఇతర దేశాల నుంచి ఒమన్ వచ్చే వాళ్లందరూ ముందుగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని..టెస్ట్ రిపోర్ట్ నెగటివ్ ఉన్నవాళ్లనే సుల్తానేట్ లోకి అనుమతించాలని ఒమన్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచ దేశాలను కోవిడ్ 19 సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఒమన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కోవిడ్ నియంత్రణకు ఏర్పాటైన సుప్రీం కమిటీ సమావేశం అయ్యింది. ప్రస్తుతం సుల్తానేట్ లో కోవిడ్ తీవ్రత ఎలా ఉంది..సేకండ్ వేవ్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు ఎలాంటి విధానాలు అవలంభించాలో సుప్రీం కమిటీ పేపర్ ప్రజంటెషన్ ద్వారా వివరించింది. సరిహద్దులు దాటి ఒమన్ లోకి వచ్చే వాళ్లందరూ ముందుగానే పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని ప్రతిపాదించింది. దీనికి అంతర్గత మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపింది. ప్రయాణానికి 96 గంటల లోపు పీసీఆర్ టెస్ట్ చేయించుకొని తమకు కోవిడ్ లేదని సర్టిఫై అయిన వారికి మాత్రమే ఇక ఎంట్రీ ఉంటుంది. ఒమన్ చేరుకున్నాక కూడా పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆ తర్వాత వారం పాటు క్వారంటైన్ లో ఉండాలి. ఎనిమిదో రోజున మరోసారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన