బహ్రెయిన్: వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

- November 02, 2020 , by Maagulf
బహ్రెయిన్: వర్చువల్ ఓపెన్ హౌజ్ నిర్వహించిన ఇండియన్ ఎంబసీ

మనామా:బహ్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ వర్చువల్ ఓపెన్ హౌజ్ ను నిర్వహించింది. రాయబారి పియూష్ శ్రీవాస్తవ, దౌత్య కార్యాలయ టీం నేతృత్వంలో జరిగిన ఈ వెబినార్ లో ప్రవాస భారతీయులు ఎదుర్కుంటున్న సమస్యలపై ఆరా తీశారు. బహ్రెయిన్ లో ఉంటున్న భారతీయులకు సంబంధించి లేబర్ ఇష్యూస్, పాస్ పోర్టు, వీసా తరహా సమస్యలను పర్కిష్కరించేందుకు ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్ నిర్వహిస్తున్న విషయం తెలిసింది. అయితే..ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు అదుపులో ఉండటంతో వర్చువల్ ద్వారా ఓపెన్ హౌజ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయుల సమస్యలు అడిగితెల్సుకున్న ఎంబసీ అధికారులు..సమస్య పరిష్కారంలో తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అన్ని రకాల విజిట్ వీసాల గడువును వచ్చే జనవరి 12 వరకు పొడిగించిన బహ్రెయిన్ ప్రభుత్వానికి ఎంబసీ అధికారులు ధన్యవాదాలు తెలిపారు. ఇది బహ్రెయిన్ లో ఉండిపోయిన భారతీయులకు ఎంతో ఊరట కలిగించే అంశమని, క్షమాభిక్షను సకాలంలో వినియోగించుకొని గడువు ముగిసే లోగానే వీసా గడువు ముగిసిన వారు సొంత ప్రాంతాలకు వెళ్లేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఎంబసీ సూచించింది. ఎంబసీ అధికారిక వెబ్ సైట్, సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఎప్పటికప్పుడు కోవిడ్ నిబంధనల్లో సవరణలు తెలుసుకొని..అందుకు అనుగుణంగా నడుచుకోవాలని తెలిపింది. ఇదిలాఉంటే బబూల్ అగ్రిమెంట్ ద్వారా ఇండియా నుంచి బహ్రెయిన్ కి చేరుకుంటున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఎంబసీ వెల్లడించింది. వందేభారత్ మిషన్ ద్వారా దాదాపు 35 వేల మంది బహ్రెయిన్ నుంచి ఇండియాకి వెళ్లారని, అదే సమయంలో ఇండియా నుంచి బహ్రెయిన్ కు 10 వేల మంది వచ్చారని ఎంబసీ కార్యాలయం వివరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com