క్వారంటైన్‌లోకి WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

- November 02, 2020 , by Maagulf
క్వారంటైన్‌లోకి WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్

జెనీవా:ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్‌ సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. కొవిడ్‌ 19 పాజిటివ్‌గా తేలిన ఒక వ్యక్తి ఇటీవల టెడ్రోస్‌ని కలిశారు. దీంతో ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని అధనామ్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి లక్షణాలు లేవని ఆయన తెలిపారు. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం.. కొన్ని రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నట్లు అధనామ్‌ పేర్కొన్నారు. అప్పటి వరకు ఇంటి నుంచే పని చేస్తానని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com