రియల్ ఎస్టేట్ రంగానికి ఒమన్ ప్రభుత్వం ఊరట.. 3 శాతానికి ఫీజుల తగ్గింపు
- November 02, 2020
ఒమాన్: దేశంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలా ఒమన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రియల్ ఎస్టేట్ కు సంబంధించి జరిగే క్రయ విక్రయాలపై ఫీజును 3 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపింది. 2020-24 మిడ్ టర్మ్ ఆర్ధిక ప్రణాళికలో భాగంగా ఈ సవరణలు చేసినట్లు ఆర్ధిక శాఖ వెల్లడించింది. కరోనా తర్వాత సంక్షోభం ఎదుర్కొంటున్న రంగాల్లో రియల్ ఎస్టేట్ కూడా ఉంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ ఫీజులను తగ్గిస్తూ ఒమన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రియాలిటీ రంగానికి కొద్దిమేర ఊరట కలిగించే అవకాశాలు ఉన్నాయి. గృహనిర్మాణ, పట్టణ ప్రణాళిక మంత్రిత్వ శాఖ అవలంభించనున్న రియల్ ఎస్టేట్ సవరణల ప్రకారం..రియల్ ఎస్టేట్ ఫీజు ట్రాన్సాక్షన్ 5 నుంచి 3 శాతానికి తగ్గనుంది. లీజ్ కు సంబంధించిన లైసెన్స్ రుసుము వాయిదాల ద్వారా చెల్లించవచ్చు. నిర్దేశిత ఫీజు చెల్లించి భవనం అంతస్తులకు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే నిర్దేశిత ప్రాంతాల్లో ఒమనీయేతరులు కూడా బహుళ అంతస్తుల వాణిజ్య సముదాయాల నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన