షార్జా రోడ్డులో 5 స్పీడ్ రాడార్స్ ఏర్పాటు
- November 02, 2020
షార్జా: అతివేగంగా వెళ్లే వాహనాలను కట్టడి చేసేందుకు షార్జాలో 5 స్పీడ్ రాడార్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. షీస్ నుంచి ఖోర్ ఫక్కన్ రహదారిలో ఈ రాడార్లను ఏర్పాటు చేశారు. నవంబర్ 2న రాడార్స్ ను ప్రారంభించినట్లు తెలిపారు. హైవేపై ఇరు వైపుల వెళ్లే వాహనాలు పరిమితికి మించి వేగంగా వెళ్తే..ఈ రాడార్లు పసిగట్టేస్తాయి. షార్జా రహదారిలో ఇటీవల వాహనాలు పరిమితికి మించి అతి వేగంగా వెళ్తున్నట్లు పలు ఫిర్యాదులు రావటంతో రాడార్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. హైవేపై అతివేగంగా వెళ్లే వాహనాలను పసిగట్టడంతో పాటు హైవేపై అనుమతి లేని ట్రక్కులు, భారీ వాహనాలను కూడా రాడార్లు గుర్తిస్తాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు