పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో 120 మంది ప్రవాసీయులపై వేటు

- November 02, 2020 , by Maagulf
పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో 120 మంది ప్రవాసీయులపై వేటు

కువైట్: కువైటీయన్లకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆ దేశం అనుసరిస్తున్న విధానాలు..ప్రవాసీయుల పాలిట శాపంగా మారాయి. కువైటేజేషన్ పాలసీ ప్రభావంతో ఇప్పటికే చాలా మంది ప్రవాసీయులు కువైట్ లో ఉపాధి కొల్పొయి దేశం విడిచి వెళ్లిపోయారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా పబ్లిక్ వర్క్స్ మినిస్ట్రిలో కూడా ప్రవాసీయుల తొలగింపు ప్రక్రియ జోరందుకుంది. ఈ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మినిస్ట్రిలో ఉద్యోగం చేస్తున్న 120 మంది ప్రవాసీయులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆ 120 మంది ఉద్యోగుల జాబితా కూడా సిద్ధమైంది. సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో వాళ్లందర్ని విధుల నుంచి తొలగించనున్నారు. తొలిగించిన 120 మంది ప్రవాసీయుల స్థానంలో కువైటీయన్లకు అవకాశం కల్పించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com