సీన్ రివర్స్...మొనాల్ ను నామినేట్ చేసిన అఖిల్..అవాక్కయిన ఇంటి సభ్యులు

- November 03, 2020 , by Maagulf
సీన్ రివర్స్...మొనాల్ ను నామినేట్ చేసిన అఖిల్..అవాక్కయిన ఇంటి సభ్యులు

ఈ రోజు మీ వల్ల జీవితంలో నేను చూడకూడనివి ఒకటి చూశాను.. వినకూడని మాట ఒకటి విన్నాను అంటూ పెదరాయుడు సినిమాలో సౌందర్యతో MS నారాయణ ఒక డైలాగ్ చెప్తాడు. ఇప్పుడు బిగ్ బాస్ 4 తెలుగులో ఇదే జరుగుతుంది. హౌస్ లో జరుగుతున్న కొన్ని పరిస్థితులు చూస్తుంటే పెదరాయుడు డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఈ సీజన్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అంటే అందరికంటే ముందు అఖిల్, మోనాల్ పేర్లు గుర్తుకు వస్తాయి. ఎందుకో తెలియదు కానీ మొదటి నుంచి ఇద్దరు బాగా కనెక్ట్ అయిపోయారు. బయట సోషల్ మీడియాలో అయితే ఇద్దరు పెళ్లి చేసుకుంటారని టాపిక్ కూడా నడుస్తుంది. ఇదే విషయం అఖిల్ ఇంట్లో వాళ్ల తల్లిదండ్రులను అడిగితే అలాంటిదేమీ లేదు.. తమ ఇంటికి గుజరాతి పిల్ల కోడలిగా రాదు అచ్చ తెలుగు అమ్మాయిని కోడలిగా తెచ్చుకుంటాం అని సమాధానమిచ్చారు.

ఇదిలా ఉంటే ఈ సీజన్ మొత్తం అఖిల్, మోనాల్ ఖచ్చితంగా కలిసే ఉంటారు.. ఎప్పటికి విడిపోరు అని అనుకున్నారు.. కానీ నాగార్జున చూపించిన ఒకే ఒక్క వీడియోతో మోనాల్ కు దూరం అయిపోతున్నాడు అఖిల్. ఈ వారం ఏకంగా ఆమెను నామినేట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ సీన్ చూసిన తర్వాత బయట ప్రేక్షకుల మాత్రమే కాదు.. ఇంటి సభ్యులు కూడా షాక్ లోకి వెళ్ళిపోయారు. అమ్మ రాజశేఖర్ అయితే కొద్దిసేపు షాక్ లోనే ఉండిపోయాడు. వాడు ఏంట్రా మోనాల్ ను నామినేట్ చేసాడు అంటూ అవినాష్ ని అడిగాడు. ఇక్కడే మొదలైంది అసలు కథ.. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత పూర్తిగా తన టీం మార్చేసింది మోనాల్.

అప్పటివరకు అఖిల్ ఒక్కడుంటే చాలు అనుకున్న ఈమె.. ఇప్పుడు ఆయనకు దూరంగా జరిగింది. మరోవైపు అఖిల్, మోనాల్ మధ్య వచ్చిన డిఫరెన్స్ లను మరింత పెంచే ప్రయత్నం చేశాడు అమ్మ రాజశేఖర్. పెద్దదిక్కుగా గొడవలను తగ్గించాల్సిందే పోయి ఇంకా పెంచేశాడు. కావాలని మోనాల్ ను రెచ్చగొట్టి ఇది చాలా తప్పు అంటూ అఖిల్ పై నిందలు వేశాడు. అంతేకాదు మోనాల్ ను తమ టీంలో జాయిన్ చేసుకున్నారు అవినాష్, అమ్మ రాజశేఖర్, అరియానా. వాళ్ళు లేకపోతే ఏంటి.. నీకు మేమున్నాం అంటూ అంతా కలిసిపోయారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే బిగ్ బాస్ లో రెండు గ్రూపులు కాదు మూడు ఉన్నట్లు అర్థమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com