కార్ ప్రమాదం తర్వాత మక్కా మసీదు దారిలో సెక్యూరిటీ పెంపు
- November 03, 2020
సౌదీ: మక్కా మసీదులో కారు ప్రమాదం తర్వాత..పవిత్ర మసీదు వైపు వెళ్లే అన్ని దారుల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు అధికారులు. పవిత్ర మక్కా మసీదు వైపు వెళ్లే దారుల్లో బారికెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పలు చోట్ల స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. గత శుక్రవారం ఓ కారు అదుపు తప్పి మక్కా మసీదు ద్వారాన్ని ఢికొట్టిన విషయం తెలిసిందే. అతన్ని అరెస్ట్ చేసిన భద్రతా సిబ్బంది..ప్రమాదం జరిగిన సమయంలో కారు డ్రైవర్ అసాధారణ స్థితిలో ఉన్నాడని వెల్లడించారు. ఇకపై పవిత్ర మసీదు ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా..వాహనాలు మసీదు వైపు దూసుకు రాకుండా బారికెడ్లు, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే..నడుచుకుంటూ మసీదుకు వచ్చే బక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







