కువైట్ ను వణికిస్తున్న వైరస్..కొత్తగా 787 కరోనా కేసులు నమోదు
- November 03, 2020
కువైట్ లో కరోనా వైరస్ తీవ్రత తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ దేశాలకు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన నేపథ్యంలో..కువైట్ లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 787 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కువైట్ వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,28,080కి చేరింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో ముగ్గురు మృతి చెందటంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 789కి పెరిగింది. అయితే..కరోనా కేసుల తీవ్రతతో పాటు...రికవరి రేటు కూడా పెరుగుతుండటం కొంత మేర ఆశాజనకంగా ఉంది. 24 గంటల వ్యవధిలో 694 మంది కోలుకున్నారు. ఓవరాల్ గా ఇప్పటివరకు 1,19.080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 8,211 కరోనా పేషెంట్లు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







