కువైట్ లో ఉండే భారతీయుడిని వరించిన అదృష్టం..బిగ్ టికెట్ లక్కీ డ్రాలో రూ.30 కోట్లు

- November 04, 2020 , by Maagulf
కువైట్ లో ఉండే భారతీయుడిని వరించిన అదృష్టం..బిగ్ టికెట్ లక్కీ డ్రాలో రూ.30 కోట్లు

కువైట్ సిటీ:కువైట్ లో ఉండే ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది. అబుధాబి బిగ్ టికెట్ బంబర్ ప్రైజ్ కొట్టేశాడు. ఎన్ఆర్ఐ నోబిన్ మాథ్యూ కొన్న టికెట్ నెంబర్ 254806కి Dh15 మిలియన్ల ప్రైజ్ మనీని గెల్చుకున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 30 కోట్ల రూపాయలు. గత నెలలో బిగ్ టికెట్ విన్నర్ గా నిలిచిన సౌదీ వ్యక్తి(ప్రస్తుతం బహ్రెయిన్ లో ఉంటున్నాడు)  తీసిన డ్రాలో నోబిన్ మాథ్యూ టికెట్ ఈ ప్రైజ్ మనీ తగిలింది. 38 ఏళ్ల నోబిన్ మాథ్యూ ప్రస్తుతం కువైట్ లోని ఓ విడి భాగాల కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ లో జరిగే Dh 12 మిలియన్ల లక్కీ డ్రాకి సంబంధించి బిగ్ టికెట్ ప్రమోషన్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. నవంబర్ 30 వరకు బిగ్ టికెట్ లక్కీ డ్రా టికెట్లు అందుబాటులో ఉంటాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com