కువైట్ లో ఉండే భారతీయుడిని వరించిన అదృష్టం..బిగ్ టికెట్ లక్కీ డ్రాలో రూ.30 కోట్లు
- November 04, 2020
కువైట్ సిటీ:కువైట్ లో ఉండే ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది. అబుధాబి బిగ్ టికెట్ బంబర్ ప్రైజ్ కొట్టేశాడు. ఎన్ఆర్ఐ నోబిన్ మాథ్యూ కొన్న టికెట్ నెంబర్ 254806కి Dh15 మిలియన్ల ప్రైజ్ మనీని గెల్చుకున్నాడు. అంటే మన ఇండియన్ కరెన్సీలో 30 కోట్ల రూపాయలు. గత నెలలో బిగ్ టికెట్ విన్నర్ గా నిలిచిన సౌదీ వ్యక్తి(ప్రస్తుతం బహ్రెయిన్ లో ఉంటున్నాడు) తీసిన డ్రాలో నోబిన్ మాథ్యూ టికెట్ ఈ ప్రైజ్ మనీ తగిలింది. 38 ఏళ్ల నోబిన్ మాథ్యూ ప్రస్తుతం కువైట్ లోని ఓ విడి భాగాల కంపెనీలో సూపర్ వైజర్ గా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే డిసెంబర్ లో జరిగే Dh 12 మిలియన్ల లక్కీ డ్రాకి సంబంధించి బిగ్ టికెట్ ప్రమోషన్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. నవంబర్ 30 వరకు బిగ్ టికెట్ లక్కీ డ్రా టికెట్లు అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







