సౌదీ:పేర్ల రిజిస్ట్రేషన్లపై కొత్త రూల్స్...షరియా కోడ్ కు వ్యతిరేక పేర్ల నమోదుపై బ్యాన్

- November 04, 2020 , by Maagulf
సౌదీ:పేర్ల రిజిస్ట్రేషన్లపై కొత్త రూల్స్...షరియా కోడ్ కు వ్యతిరేక పేర్ల నమోదుపై బ్యాన్

రియాద్:పేర్ల నమోదుకు సంబంధించి అనుసరించాల్సిన కొత్త నిబంధనలను ప్రకటించింది సౌదీ అధికార యంత్రాంగం. ఇక నుంచి ఇస్లామిక్ షరియా కోడ్ ను ఉల్లంఘించేలా ఉండే పేర్లను నమోదుపై నిషేధం విధిస్తున్నట్లు వెల్లడించింది. అబ్ధుల్ రసూల్(ప్రవక్త దాసుడు), మలక్(ఎంజిల్) పేర్లతో ఇక నుంచి ఎవరికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయబడవని అంతర్గత మంత్రిత్వ శాఖలోని పౌర వ్యవహారాల విభాగం అధికారులు తెలిపారు. మతపరమైన విశ్వాసాలు, ఫత్వాకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో మహమ్మద్ సలేహ్, మహమ్మద్ ముస్తఫా తరహాలో రెండు పేర్ల సమ్మేళితం అయ్యేలా ఉండే పేర్లపై కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవని వివరించారు.  ఇలాంటి రెండు పేర్ల సమ్మేళనంలో సౌదీ చట్ట ప్రకారం తొలి పేరును పరిగణలోకి తీసుకోబోమని తెలిపారు. అయితే...ప్రజల్లో గందరగోళానికి తావులేకుండా పేర్ల రిజిస్ట్రేషన్ పై నిషేధానికి సంబంధించి మాత్రం అధికారులు ఎలాంటి అధికారిక వివరణను ఇవ్వలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com