ప్రవాసీయులకు అదనపు హక్కులను ప్రకటించిన సౌదీ అరేబియా

- November 04, 2020 , by Maagulf
ప్రవాసీయులకు అదనపు హక్కులను ప్రకటించిన సౌదీ అరేబియా

సౌదీ: రియాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక ప్రకటన చేసిన సౌదీ మంత్రిత్వ శాఖ.

ఉద్యోగస్తులు తమ యజమాని అనుమతి లేకుండా ఎగ్జిట్ / రీ-ఎంట్రీ వీసాలను అభ్యర్థించడానికి అనుమతి కల్పిస్తూ ప్రకటనలు జారీ చేసింది ప్రభుత్వం. దీని ద్వారా మార్కెట్లో ఎక్కువ పోటీ పెంచటమే కాకుండా మంచి ప్రతిభను ఆకర్షించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం భావించింది.

కింగ్డమ్ విజన్ 2030 మరియు నేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త సంస్కరణలు మార్చి 2021 నుండి అమల్లోకి రావటమే కాకుండా ఇది ప్రవాస కార్మికులకు అదనపు హక్కులను కల్పిస్తుందని సౌదీ ప్రభుత్వం తెలిపింది.

ఈ కొత్త ఆదేశాలు యజమాని అనుమతి అవసరం లేకుండానే స్వయంచాలకంగా ఆమోదించబడతాయి. స్మార్ట్ఫోన్ అప్లికేషన్ ‘అబ్షర్’ ద్వారా మరియు మంత్రిత్వ శాఖ యొక్క ఎలక్ట్రానిక్ వెబ్ పోర్టల్ ఈ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని మానవ వనరుల మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ మీడియాకు నివేదించింది.

ఈ నూతన ప్రకటన మూలంగా స్థానిక యజమానులు మరియు ప్రవాస కార్మికుల మధ్య వివాదాలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేసారు అధికారులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com