పైలట్లకు 12 నెలల అన్‌పెయిడ్‌ లీవ్‌

- November 04, 2020 , by Maagulf
పైలట్లకు 12 నెలల అన్‌పెయిడ్‌ లీవ్‌

దుబాయ్‌కి చెందిన క్యారియర్‌ ఎమిరేట్స్‌, 12 నెలల అన్‌పెయిడ్‌ లీవ్‌ని కొందరు పైలట్స్‌కి అందిస్తోంది. కరోనా ప్రభావం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అన్‌పెయిడ్‌ లీవ్‌, ఫ్లెక్సిబుల్‌ వర్క్‌ టైం మోడల్స్‌ వంటి అంశాల్ని ఎమిరేట్స్‌ ప్రోత్సహిస్తోంది. అన్‌పెయిడ్‌ లీవ్‌ సమయంలో అకామడేషన్‌, మెడికల్‌ కవర్‌ ఇతర అలవెన్స్‌లను అందించడం జరుగుతుందని ఎయిర్‌లైన్స్‌ అధికార ప్రతినిది¸ చెప్పారు. కాగా, జూన్‌లో ఎమిరేట్స్‌, ఉద్యోగులకు లే-ఆఫ్‌ ప్రకటించింది. కరోనా కారణంగా ఏర్పడిన సంక్షోభం వల్ల ఖర్చులు తగ్గించుకోవడం కోసం ఇలాంంటి ప్రయత్నాలు జరిగాయి. కాగా, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 60,000 మంది ఉద్యోగులు పనిచేశారు ఎమిరేట్స్‌తో. కాగా, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ 2021లో 46 శాతానికి రెడెన్యూస్‌ కోల్పోతాయని అంచనా వేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com