తెలంగాణలో కొత్తగా 1,539 కరోనా కేసులు
- November 05, 2020
హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా కరోనా కేసుల వివరాలను ఈరోజు ఉదయం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,539 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఐదుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 978 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,45,682 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,25,664 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1362కి చేరింది. ప్రస్తుతం 18,656 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 15,864 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో మొత్తం 123 కేసులు నిర్ధారణ అయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







