రికార్డు స్థాయిలో షాబు డ్రగ్‌ స్వాధీనం

- November 05, 2020 , by Maagulf
రికార్డు స్థాయిలో షాబు డ్రగ్‌ స్వాధీనం

కువైట్ సిటీ:కువైట్‌లో రికార్డు స్థాయిలో 270 కిలోల షాబు డ్రగ్‌ని సీజ్‌ చేశారు. దేశంలో ఇప్పటిదాకా జరిగన డ్రగ్స్‌ సీజ్‌లో ఇదే అతి పెద్దది. షువైఖ్‌ సీ పోర్ట్‌లో ఈ సీజ్‌ జరిగింది. ఇంటీరియర్‌ మినిస్ట్రీకి చెందిన జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెక్యూరిటీ రిలేషన్స్‌ అండ్‌ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. పక్కాగా అందిన సమాచారం నేపథ్యంలో జిఎడిసి సిబ్బంది, డ్రగ్స్‌ స్మగ్లర్స్‌ని ట్రాక్‌ చేశారు.. రెండు వాహనాల్లో సాల్ట్‌ డ్రగ్స్‌ తీసుకొస్తుండగా అందులోని షబుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్స్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డిప్యూటీ ప్రైమ్  మినిస్టర్‌, ఇంటీరియర్‌ మినిస్టర్‌ అండ్‌ మినిస్టర్‌ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ క్యాబినెట్‌ ఎఫైర్స్‌ అనాస్‌ అల్‌ సలెహ్‌ ఈ సందర్భంగా అధికారుల్ని అభినందించారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com