అక్రమంగా గుమికూడిన వలసదారుల అరెస్ట్‌

- November 05, 2020 , by Maagulf
అక్రమంగా గుమికూడిన వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌: దోఫార్‌ గవర్నరేట్‌లో వలసదారులు పెద్ద సంఖ్యలో గుమికూడిన దరిమిలా, వారిని అరెస్ట్‌ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ నిబంధనల్ని వలసదారులు గుమికూడటం ద్వారా ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అరెస్టయినవారిలో ఓ పౌరుడు కూడా వున్నారు. అరెస్ట్‌ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com