రికార్డు స్థాయిలో షాబు డ్రగ్ స్వాధీనం
- November 05, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో రికార్డు స్థాయిలో 270 కిలోల షాబు డ్రగ్‌ని సీజ్ చేశారు. దేశంలో ఇప్పటిదాకా జరిగన డ్రగ్స్ సీజ్‌లో ఇదే అతి పెద్దది. షువైఖ్ సీ పోర్ట్‌లో ఈ సీజ్ జరిగింది. ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. పక్కాగా అందిన సమాచారం నేపథ్యంలో జిఎడిసి సిబ్బంది, డ్రగ్స్ స్మగ్లర్స్‌ని ట్రాక్ చేశారు.. రెండు వాహనాల్లో సాల్ట్ డ్రగ్స్ తీసుకొస్తుండగా అందులోని షబుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్స్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, ఇంటీరియర్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ క్యాబినెట్ ఎఫైర్స్ అనాస్ అల్ సలెహ్ ఈ సందర్భంగా అధికారుల్ని అభినందించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







