'సంధ్య' స్పూర్తితో మైనింగ్ రంగంలోకి మహిళలు: కవిత
- November 05, 2020
తెలంగాణ: దేశంలోనే తొలిసారిగా అండర్ గ్రౌండ్ మైనింగ్‌లో సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికేట్ సాధించిన యువతి రాసకట్ల సంధ్యను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. హైదరాబాద్ లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత ని కలిసిన సంధ్య.. మహిళలకు మైనింగ్ రంగంలో అవకాశాలు కల్పించాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత కి కృతజ్ఞతలు తెలిపారు. మైనింగ్ రంగంలో సంధ్య సాధించిన విజయం, ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు ఎమ్మెల్సీ కవిత. "సంధ్య రసకట్ల, భారతదేశ మైనింగ్ రంగంలో, అండర్ గ్రౌండ్ సెకండ్ క్లాస్ మేనేజర్ గా సర్టిఫికెట్ పొందిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. మన రాష్ట్ర మహిళలు సాధిస్తున్న గొప్ప విజయాలతో, హృదయం గర్వంతో నిండిపోతోంది. మీరు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నాను" అంటూ ఇటీవల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన రాసకట్ల సంధ్య, అండర్ గ్రౌండ్ మైన్‌లో ఎన్‌సీఎంఎంసీ (సెకండ్ క్లాస్ మైన్ మేనేజ్మెంట్ కాంపిటెన్సీ) ధ్రువీకరణ పత్రాన్ని పొందిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. బీటెక్ మైనింగ్ చదివిన సంధ్య, రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (వేదాంత) కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె తండ్రి రఘు, సింగరేణి కార్మికుడు.
మహిళలకు మైనింగ్ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని, ఎంపీగా ఉన్న సమయంలో అనేకసార్లు పార్లమెంటులో ప్రస్తావించారు ఎమ్మెల్సీ కవిత. గతంలో సింగరేణి కార్మిక సంఘం టీబీజీకేఎస్ అధ్యక్షురాలుగా పనిచేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడ్డారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 42 బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, ఎమ్మెల్సీ కవిత నేతృత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.


తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







