గోల్డ్‌ స్మగ్లింగ్‌: ఒకరి అరెస్ట్‌

- November 05, 2020 , by Maagulf
గోల్డ్‌ స్మగ్లింగ్‌: ఒకరి అరెస్ట్‌

హైదరాబాద్: హైదరాబాద్ ‌ కస్టమ్స్ అధికారులు, దుబాయ్‌ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి నుంచి 71.47 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని 12 చిన్న ముక్కలుగా మార్చి, నిందితుడు స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ బంగారం విలువ 3,67,570 రపాయలు వుంటుందని తేల్చారు. జీన్స్‌లోపల జిప్‌ ఫ్లయర్‌లో నిందితుడు ఈ బంగారాన్ని దాచినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి ఫ్లైట్‌ నెంబర్‌ ఐఎక్స్‌ 1948లో నిందితుడు హైద్రాబాద్‌కి వచ్చాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com