దుబాయ్ మాల్స్‌లో కోవిడ్ టెస్టింగ్ స్టేషన్స్ వేళల మార్పు
- November 05, 2020
దుబాయ్: దుబాయ్ హెల్త్ అథారిటీ, పిసిఆర్ కోవిడ్ 19 స్టేషన్స్ మయాన్ని మార్చడం జరిగింది. మాల్స్‌లోని టెస్టింగ్ స్టేషన్స్‌కి సంబంధించి ఈ మార్పులు జరిగాయి. మాల్ ఆఫ్ ఎమిరేట్స్, సిటీ సెంటర్ మిర్దిఫ్, సిటీ సెంటర్ డీరాలలోని పీసీఆర్ టెస్టింగ్ స్టేషన్స్ వాక్ ఇన్ బేసిస్‌లో ఆదివారం నుంచి బుధవారం వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. గురువారం నుంచి శనివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేస్తాయి. జ్వరం, శ్వాస సంబంధ సమస్యలున్నవారు ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, ఇది కేవలం నాన్ మెడికల్ అవసరాల నిమిత్తం, ట్రావెల్ సంబంధిత అవసరాల నిమిత్తం ఏర్పాటు చేయబడిన టెస్టింగ్ సెంటర్. కాగా, ప్రతి టెస్టింగ్ సెంటర్‌లో రోజుకి 180 టెస్టులు చేసే అవకాశం వుంది. పిసిఆర్ టెస్ట్ రిజల్ట్ కోసం 150 దిర్హాములు చెల్లించాల్సి వుంటుంది. 24 గంటల్లో రిపోర్ట్ సంబంధిత వ్యక్తికి అందుతుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు