వినియోగదారుల రద్దీని తట్టుకునేందుకు షాపింగ్ మాల్స్ గడువును పొడిగంచిన సౌదీ
- November 07, 2020
సౌదీ:షాపింగ్ మాల్స్ లో వినియోగదారుల రద్దీని తగ్గించేందుకు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంది. పరిమితి సమయ వేళలతో షాపింగ్ మాల్స్ సీజన్ సేల్స్ కు విపరీతమైన గిరాకీ ఉంటోంది. దీంతో సీజనల్ సేల్స్ గడవును పెంచుతున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సీజనల్ సేల్స్ గడువు పెంచటం ద్వారా మాల్స్ లో వినియోగదారుల రద్దీని నియంత్రించొచ్చని మంత్రిత్వ శాఖ చెబుతోంది. అంతేకాదు..ప్రస్తుత పరిస్థితుల ప్రభావం కారణంగా వార్షిక అమ్మకాల లోటును కూడా అదనపు గడువు ద్వారా భర్తీ చేసుకునే వెసులుబాటు కలుగుతుందని పేర్కొంది. ఇదిలాఉంటే..షాపింగ్ మాల్స్ లో కోవిడ్ 19 నిబంధనల్ని ఖచ్చితంగా పాటించి తీరాలని మంత్రిత్వ శాఖ మరోసారి హెచ్చరించింది. ప్రతి ఒక్కరు ఫేస్ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ట్రాలీలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలను ఉల్లంఘిస్తే SR10,000 జరిమానా విధిస్తామని హెచ్చరించింది. వినియోగదారులు, మాల్స్ సిబ్బందికి ఎంట్రన్స్ దగ్గరే టెంపరేచర్ చెక్ చేయాలని పేర్కొంది. మాల్స్ లోగానీ, వెలుపలగానీ జనం గుమికూడకుండా చూసుకోవాలని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 50 మందికి మించకూడదని వెల్లడించింది. ఈ నిబంధనల్లో ఉల్లంఘనకు పాల్పడితే R50,000 జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







