రూ.50 వేలకు మించి నిర్వహించే ఆర్థిక లా వాదేవీల్లో పాన్ కార్డు తప్పనిసరి

- February 15, 2016 , by Maagulf
రూ.50 వేలకు మించి నిర్వహించే ఆర్థిక లా వాదేవీల్లో పాన్ కార్డు తప్పనిసరి

రూ. 50 వేల లావాదేవీలు దాటితే అవసరం వ్యాపారులకు రూ. రెండు లక్షలు దాటితే .. గుంటూరు (నల్లచెరువు) : నల్ల ధనాన్ని నియంత్రించడంతో పాటు ప్రతి వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించే దిశగా సన్నద్ధం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్‌ లావాదేవీల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టిం ది. ఈ ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త ని బంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. రూ.50 వేలకు మించి నిర్వహించే ఆర్థిక లా వాదేవీల్లో పాన (పర్మినెంట్‌ అకౌంట్‌ నెంబర్‌) తప్పనిసరి చేసింది. ఈ ఖాతాల్లో నగదు లావాదేవీలు జరిపే సమయంలో ఖచ్చితంగా పాన నెం బర్‌ రాయాలనే నిబంధన కఠినతరం చేసింది. ఒక వేళ పాన నెంబర్‌ లేకుం టే ఫారం 60 తప్పనిసరిగా అందించాలని సూచించింది. ఫారం 60లో పేరు, చిరునా మా, ఆధార్‌ సంఖ్య, ఓటర్‌ నెంబర్‌, పుట్టిన తేదీ, వ్యక్తిగత వివరాలు అన్నీ నమోదు చేయించాల్సి ఉంటుంది. లావాదేవీ చెక్‌, డీడీ, ఆనలైన దేని ద్వారా నిర్వహించారో ఫారంలో పొందుపరచాల్సి ఉంటుంది. లావాదేవీ నిర్వహించే వ్యక్తి వార్షిక వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం పొందుపరచాల్సి ఉంది. జిల్లాలో తక్కువ శాతం మందికే .. జిల్లా జనాభా మొత్తం 48 లక్షలు ఉంటే బ్యాంకు ఖాతాలున్న వారు ప్రధాన మంత్రి జనధనయోజనతో కలిపి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల్లో దాదాపు 25 లక్షల వరకు ఉన్నారు. వీరిలో పాన నంబర్‌ ఉన్న వారి సంఖ్య పది లక్షలకు మించి ఉండదు అన్ని అకౌంట్ల దారులు ఏదో ఒక సందర్భంలో రూ.50 వేలకు మించి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వీరి అకౌంట్లను వేరే వారు వినియోగించి లావాదేవీలు జరుపుతుండటమే ఇందుకు కారణంగా బ్యాంకర్లు చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకర్లు ఖచ్చితమైన చర్యలు తీసుకుంటే ఆదాయపు పన్ను శాఖకు ఆదాయం పెరగడంతో పాటు నల్లధనం అరికట్టేందుకు మార్గం సుగమమవుతుంది. ఈ లావాదేవీలకు తప్పనిసరి.. ఏడాదిలో జీవిత బీమా కోసం రూ. 50 వేలు వరకు చెల్లిస్తుంటే.. రూ. రెండు లక్షలకు మించి బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే.. రూ. 10 లక్షలకు మించి స్థిరాస్తి కొనుగోలు చేస్తే హోటల్‌ బిల్లు, విదేశీ ప్రయాణ టిక్కెట్లు కొనుగోలుకు రూ.50 వేలు చెల్లిస్తే బ్యాంకులు, తపాలా శాఖలో రూ.50 వేలకు మించి లావాదేవీలు జరిపితే రూ. 50 వేలకు మించి క్యాష్‌, ప్రీపెయిడ్‌ కార్డుల కోసం చెల్లిస్తే అవసరం. కొత్త ఖాతా తెరవాలనుకునే వారు పాన నెంబర్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. జన్ ధన్ యోజన ఖాతాలు తెరిచే వారికి ఈ నిబంధన వర్తించదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com