ఆరో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- April 29, 2024
న్యూ ఢిల్లీ: భారత దేశంలో ఆరో దశలో నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ దశలో బిహార్, హరియాణా, ఝార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
ఈ ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలోని మొత్తం 57 లోక్‌సభ స్థానాలకు మే 25న పోలింగ్ జరుగుతుంది. బిహార్ లో 8, హరియాణాలో 10, ఝార్ఖండ్‌లో 4, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్‌లో 14, పశ్చిమ బెంగాల్‌లో 8, ఢిల్లీలో 7 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. అభ్యర్థులు ఇవాళ్టి నుంచి నామినేషన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉంది.
దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఏడో దశ ఎన్నికలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. ఏడో దశలోనూ దేశంలోని 57 స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. జూన్ 1న ఈ చివరి దశ ఎన్నికలు నిర్వహిస్తారు.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇప్పటికే దేశంలో తొలి రెండు దశల ఎన్నికలు ముగిశాయి. తొలి దశలో 102, రెండో దశలో 89 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







