చెస్ రారాజుకు నగదు పురస్కారం…
- April 29, 2024
చెన్నై: ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ నకు అర్హత సాధించిన దొమ్మరాజు గుకేష్ కు రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అందజేశారు. ఇటీవల టొరంటోలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన ఈ చెన్నై టీనేజర్ వరల్డ్ చాంపి యన్‌షిప్‌నకు క్వాలిఫై అయిన పిన్నవయస్సు ఆటగాడిగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
గుకేష్ తన తల్లిదండ్రులతో కలిసి సీఎం క్యాంప్ కార్యాలయంలో స్టాలిన్‌ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా గుకేష్ ను శాలువతో సత్కరించి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం తరపున అతడికి రూ. 75 లక్షలతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో క్రీడామంత్రి ఉదయనిధి కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







