కువైట్:మహబౌలా బీచ్ లో ప్రమాదం..నీటిలో మునిగి ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి

- November 07, 2020 , by Maagulf
కువైట్:మహబౌలా బీచ్ లో ప్రమాదం..నీటిలో మునిగి ఇద్దరు తెలుగు వ్యక్తుల మృతి

కువైట్ సిటీ:కువైట్ లోని మహబౌలి బీచ్ లో జరిగిన ప్రమాదంలో ఏపీకి చెందిన ఇద్దరు మృతి చెందారు. చనిపోయినవారిని శేఖర్ ఎరువురి వీరయ్య(36), చిన్నయ్య మాధురి(39) గా గుర్తించారు. ఈ ఇద్దరు బదెర్ అల్ ముల్లా కంపెనీలో మెకానికల్ డివిజన్ లో పని చేస్తున్నారు. నిన్న ఉదయం బీచ్ కు వెళ్లిన  వీరయ్య, చిన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com