BFS ప్రారంభించడానికి TSRTCతో ఒప్పందం కుదుర్చుకున్న హైదరాబాద్ ఎయిర్ కార్గో
- November 07, 2020
హైదరాబాద్: అంతర్జాతీయ ఎగుమతి, దిగుమతి కార్గోను ప్రోత్సహించడానికి GMR ఎయిర్ కార్గో & ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లిమిటెడ్ (GACAEL) విభాగమైన GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో (GHAC) నేడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC)తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం GMR హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్ నుంచి తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు కార్గో బస్ ఫీడర్ సర్వీస్ (BFS) ను ఏర్పాటు చేస్తారు.
తెలంగాణ ప్రభుత్వ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో, జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సిఇఒ సౌరభ్ కుమార్ మరియు సునీల్ శర్మ, ప్రిన్సిపల్ సెక్రటరీ- టిఆర్&బి మరియు మేనేజింగ్ డైరెక్టర్-TSRTC ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు.
భారతదేశపు ఆధునిక ఎయిర్ కార్గో టెర్మినల్‌లలో GHAC ఒకటి. వివిధ రకాల సరుకుల రవాణాకు ఇది అనేక సౌకర్యాలను అందిస్తుంది. ఫార్మా, వ్యాక్సిన్లు, పెరిషబుల్స్, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ & ఎలక్ట్రానిక్ గూడ్స్ వంటి సున్నితమైన సరుకులను నిర్వహించడం GHAC ప్రత్యేకత. -20 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు కార్గోను నిర్వహించడానికి ఇక్కడ కోల్డ్ రూములు, ప్రాసెసింగ్ సౌకర్యాలన్నాయి. వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న GHAC డెడికేటెడ్ ఫ్రైటర్స్, చార్టర్స్ మరియు ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్ ద్వారా విస్తారమైన అంతర్జాతీయ కనెక్టివిటీ కలిగి, దక్షిణ-మధ్య భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా 200 గమ్యస్థానాలతో అనుసంధానించే ముఖద్వారంగా ఉంది.
ఈ అవగాహన ఒప్పందం ప్రకారం, TSRTC జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో టెర్మినల్‌కు పిక్-అప్, డెలివరీ సేవలను ప్రారంభిస్తుంది. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే అంతర్జాతీయ దిగుమతులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని మారుమూల ప్రాంతాలకు అనుసంధానించడానికి కనెక్టివిటీని అందిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫార్మా మరియు పెరిషబుల్ ఉత్పత్తుల ఎగుమతులకు విశ్వసనీయమైన కనెక్టివిటీని అందించే రీఫర్ కార్గో బస్ సర్వీస్‌ను కూడా ప్రారంభించే అవకాశం ఉంది.
SGK కిషోర్, ED- సౌత్ & CIO, GMR విమానాశ్రయాలు, “ఒక బహుళ ఎయిర్ కార్గో కారిడార్‌ను అభివృద్ధి చేయడంలో GMR కార్గో - TSRTC లు చేసుకున్న ఈ ఎంవోయూ ఒక వ్యూహాత్మక మైలురాయి లాంటిది. తెలంగాణలోని మెరుగైన రోడ్డు రవాణా సదుపాయాలు మరియు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, అంతర్జాతీయ కనెక్టివిటీ కలిగిన హైదరాబాద్ ఎయిర్ కార్గో కలిసి అంతర్జాతీయ ఎయిర్ కార్గో వాణిజ్యం చేసే వారందరికీ నూతన వ్యాపారావకాశ ద్వారాలను తెరుస్తుంది. ఈ ఒప్పందం సహకార విధానం ద్వారా వాణిజ్య వర్గాలకు ప్రయోజనం చేకూర్చి, హైదరాబాద్ నుండి ఎగుమతి, దిగుమతులను పెంచుతుంది.’’ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ “TSRTC మరియు GMR మధ్య అద్భుతమైన భాగస్వామ్యానికి గొప్ప ఇది ప్రారంభం. ఇది రెండు సంస్థలూ అభివృద్ధి చెందడానికి తొలి మెట్టు. మా భాగస్వామ్యం ద్వారా తెలంగాణ, ఇతర పొరుగు రాష్ట్రాలలో ఎలాంటి ఆటంకాలు లేని రవాణా సేవలు అందించడానికి దోహదపడుతుంది. ” అన్నారు.
అంతర్జాతీయ ఎయిర్ కార్గో వాణిజ్యం కోసం GMR కార్గో మరియు TSRTC సంయుక్తంగా కార్గో బస్ ఫీడర్ సేవలను అందించనున్నాయి. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా ప్రధాన ఫీడర్, డెలివరీ మార్గాలలో కార్గో బస్ సేవలను జిఎంఆర్ GMR ప్రారంభించనుంది. GMR కార్గో బుకింగ్, డెలివరీ సంబంధిత సేవల కోసం GMR కార్గో టెర్మినల్ వద్ద TSRTC కౌంటర్లను కూడా తెరవనుంది.
ఈ కార్యక్రమంలో ఎస్. కృష్ణ కాంత్ పార్సెల్, కొరియర్ & కార్గో సర్వీసెస్ స్పెషల్ ఆఫీసర్, TSRTC తులసి ప్రసాద్, హైదరాబాద్ రీజియన్ చైర్మన్ ఎయిర్ కార్గో ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై ముంబై విజయం
- యూఏఈలో ఉన్నత విద్యాసంస్థల్లో తాత్కాలికంగా రిమోట్ లెర్నింగ్ అమలు
- కేరళలో యూడీఎఫ్ ప్రభంజనం: సీఎం అభ్యర్థి పై శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి: ప్రధాని మోడీ
- ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లో అగ్ని ప్రమాదం
- ఇరాన్ నుంచి వచ్చిన నాలుగు క్రూజ్ క్షిపణులను గుర్తించిన యూఏఈ వైమానిక రక్షణ వ్యవస్థ
- భవానీపూర్‌లో మమతా బెనర్జీ ఓటమి!
- చరిత్ర సృష్టించిన సుమతి ఐపీఎస్–తొలి మహిళా కమిషనర్‌గా బాధ్యతలు
- కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయం పై గళమెత్తనున్న టీఆర్ఎస్ అధినేత్రి
- నిర్మాణ రంగ కార్మికుల పిల్లల కోసం దేశంలోనే తొలిసారిగా వర్క్ సైట్ స్కూల్: సీపీ డాక్టర్ ఎం.రమేష్









