ఐరా సినిమాస్ ప్రొడక్షన్ నం.1 ఫిల్మ్ ప్రారంభం
- November 07, 2020
హైదరాబాద్:నాగశౌర్య హీరోగా 'ఛలో', 'అశ్వథ్థామ' లాంటి సూపర్ హిట్ సినిమాల్ని నిర్మించిన ఐరా క్రియేషన్స్ సంస్థ నుంచి సోదర సంస్థగా ఐరా సినిమాస్ ప్రారంభమైంది.
ఔత్సాహిక నటులు, దర్శకులతో కంటెంట్ ప్రధాన చిత్రాలను నిర్మించడం ఐరా సినిమాస్ ఏర్పాటులోని ఉద్దేశం. చిత్రసీమలోకి అడుగుపెట్టాలని కలలు కనే నూతన నటులు, దర్శకులకు ఇది మంచి అవకాశం.
హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో ఐరా సినిమాస్ నిర్మిస్తోన్న తొలి చిత్రం ప్రారంభోత్సవం జరిగింది. సన్నీ కొమాలపాటి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి నటుడు, వ్యాపారవేత్త, ఏఎస్పీ మీడియా హౌస్ అధినేత అభినవ్ సర్దార్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉషా శంకర్‌ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ, "ఇవాళ మంచిరోజు కావడంతో పూజా కార్యక్రమాలు నిర్వహించాం. ఐరా సినిమాస్ అనేది ఐరా క్రియేషన్స్‌కు సోదర సంస్థ. యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో బ్యానర్‌ను ప్రారంభించాం. ఫ్రెష్ కంటెంట్‌తో బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్‌ను ఈ బ్యానర్‌పై నిర్మిస్తాం. సన్నీ కొమాలపాటి దర్శకత్వంలో మేం నిర్మిస్తున్న తొలి చిత్రం ఓ థ్రిల్లర్" అని చెప్పారు.
త్వరలో ఈ చిత్రానికి పనిచేసే తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.
దర్శకుడు: సన్నీ కొమాలపాటి
నిర్మాత: ఉషా శంకర్‌ప్రసాద్ ముల్పూరి
సహ నిర్మాత: అభినవ్ సర్దార్
సమర్పణ: బుజ్జి
బ్యానర్స్: ఐరా సినిమాస్, ఏఎస్పీ మీడియా హౌస్
తాజా వార్తలు
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!